

తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచి పదవులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచి పదవులకు 12,782 మంది, వార్డు సభ్య స్థానాలకు 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 57,22,465 మంది ఓటర్లు, 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుండగా, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహించనున్నారు.
రెండో దశలో 4,333 సర్పంచి, 38,350 వార్డు సభ్య పదవులకు నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో 415 సర్పంచి, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో 5 గ్రామాలు, 108 వార్డుల్లో నామినేషన్లు రాకపోగా, 2 గ్రామాలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిపివేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 4,593 రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది సిబ్బంది, 2,489 సూక్ష్మ పరిశీలకులను నియమించారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,769 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!