
సినిమాలు

పార్కింగ్‌లో ఉన్న లుఫ్తాన్సాకు చెందిన బోయింగ్ విమానం అకస్మాత్తుగా ముందుకు ఒరిగి పలువురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. గురువారం ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకోగా, దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి లాస్ ఏంజెలెస్‌కు బయలుదేరాల్సిన బోయింగ్ 787-9 విమానం గేటు వద్ద నిలిపి ఉంచిన సమయంలో ల్యాండింగ్ గేర్ విరిగిపోవడంతో విమానం ముందుభాగం నేలపై పడిపోయింది. ప్రమాద సమయంలో ప్రయాణికులు ఎవరూ లేరు. అయితే విమాన సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ ఉన్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!