

ఆద్యంతం అనూహ్య ఫలితాలతో ఆసక్తికరంగా సాగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్ ప్రత్యర్థులు ఖరారయ్యారు. క్వాలిఫయర్ మాయా ఖాలీన్‌స్కా (పోలెండ్) మరియు 19 ఏళ్ల రష్యా క్రీడాకారిణి మిర్రా ఆండ్రీవా మధ్య శనివారం టైటిల్ పోరు జరగనుంది. ఈ ఇద్దరికీ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం.
గురువారం జరిగిన సెమీఫైనల్లో ఖాలీన్‌స్కా 7-6 (7-4), 6-4 తేడాతో 25వ సీడ్ ష్నైడర్‌ను ఓడించింది. తొలి సెట్ టైబ్రేక్‌కు వెళ్లి ఉత్కంఠ రేపింది. మరో సెమీఫైనల్లో ఆండ్రీవా 6-1, 6-3తో ఉక్రెయిన్‌కు చెందిన మార్టా కోస్ట్యూక్‌ను సునాయాసంగా ఓడించింది. రెండేళ్ల క్రితం ఇదే టోర్నీలో సెమీఫైనల్లో ఓడిన ఆండ్రీవా ఈసారి ఫైనల్ చేరి 21వ శతాబ్దంలో మూడో పిన్న వయస్కురాలిగా నిలిచింది. అలాగే 2005 తర్వాత జన్మించిన క్రీడాకారిణుల్లో మేజర్ సింగిల్స్ ఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కరచాలనం జరగలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!