

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం రోజురోజుకు భారీ అంచనాలను సృష్టిస్తోంది. వాల్తేరు వీరయ్య విజయానంతరం దర్శకుడు బాబీ కొల్లి తో మరోసారి జతకట్టిన చిరంజీవి, ఈసారి కూడా పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో కథ, పాత్రల రూపకల్పన నుంచి ప్రతి అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటిగా నిలిచేలా ఈ పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చిలో చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ప్రత్యేక వీడియోలో చిరంజీవి కొత్త లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేక శారీరక మేకోవర్ కూడా చేసినట్లు సమాచారం. సంగీతాన్ని థమన్ అందిస్తుండగా, కోన వెంకట్, చక్రవర్తి రెడ్డి కథా రూపకల్పనలో భాగస్వాములయ్యారు. హీరోయిన్‌తో పాటు ఇతర కీలక పాత్రలకు సంబంధించిన ప్రకటనలు త్వరలో వెలువడనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!