

టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం నాగబంధం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. పురాణ గాథలు, సాహసకథ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ కలయికగా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ ప్రాజెక్ట్‌కు విదేశీ మార్కెట్లలో కూడా విశేష స్పందన లభిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికా, యూరప్ ప్రాంతాల్లో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోందని సమాచారం.
సినిమా ఓవర్సీస్ పంపిణీ హక్కులను ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సొంతం చేసుకోవడం ప్రాజెక్ట్‌కు మరింత బలం చేకూర్చింది. జూలై 2న నార్త్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రాంతాల్లో ప్రత్యేక ప్రీమియర్ షోలను నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అనంతరం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. యువ నటుడు విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన విజువల్ ఎఫెక్ట్స్, సాహస ఘట్టాలు, మిస్టరీ అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద నాగబంధం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!