

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరియు అంజలి టెండూల్కర్ దంపతుల కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం గత గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు, పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ వేడుకలో అర్జున్ సోదరి సారా టెండూల్కర్ తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె ధరించిన ప్రత్యేకమైన మీనాకారి నెక్లెస్ అందరి చూపును కట్టిపడేసింది.
ఈ నెక్లెస్ జైపూర్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ సునీతా షెఖావత్ కలెక్షన్లోని ప్రత్యేక ఆభరణం. సంప్రదాయ కుందన్ సెట్ పోల్కీలు, పూల మోటిఫ్‌లు, అద్భుతమైన హస్తకళతో రూపొందించిన ఈ నెక్లెస్‌లో కొలంబియన్ ఎమరాల్డ్లు మరియు సౌత్ సీ ముత్యాలు అమర్చారు. ప్రముఖ ఆభరణాల నిపుణురాలు ప్రియంషు గోయెల్ తెలిపిన ప్రకారం ఈ ఆభరణం విలువ రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉండవచ్చని పేర్కొన్నారు. దాన్ని తయారు చేయడానికి 360 గంటలకు పైగా సమయం పట్టిందని కూడా వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!