
సినిమాలు

దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూ సాధారణ స్థాయిని దాటుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతుండగా, మధ్యాహ్నం సమయానికి భానుడు భగభగమంటూ తీవ్ర వేడి నమోదవుతోంది. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.
ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ రోజు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశం ఉంది. రాత్రి మరియు తెల్లవారుజామున కనిష్ట ఉష్ణోగ్రతలు 17 నుంచి 19 డిగ్రీల మధ్య ఉండొచ్చని అధికారులు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!