

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జరిగిన రెండు నెలల హుండీ లెక్కింపులో దేశీయ కరెన్సీతో పాటు పలు దేశాల విదేశీ కరెన్సీ విరాళాలు కూడా భారీగా నమోదయ్యాయి. అమెరికా నుంచి 2014 డాలర్లు, ఇంగ్లాండ్ నుంచి 65 పౌండ్లు, సౌదీ అరేబియాలోని భక్తుల నుంచి 61 రియాల్స్, ఒమన్ నుంచి 2 రియాల్స్, మలేసియా నుంచి 51 రింగ్గిట్స్ మరియు యూరోపియన్ దేశాల నుంచి 15 యూరోలు లభించాయి.
అదేవిధంగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 970, కెనడా నుంచి 1245 డాలర్లు, న్యూజీలాండ్ నుంచి 95, ఆస్ట్రియా నుంచి 75, సింగపూర్ నుంచి 41, కువైట్ నుంచి 2¼, ఖతర్ నుంచి 318, మెక్సికో మరియు చైనా నుంచి చెరో 20, నేపాల్ నుంచి 5, పోలాండ్ నుంచి 70, థాయిలాండ్ నుంచి 40, శ్రీలంక నుంచి 10 యూనిట్ల విదేశీ కరెన్సీ విరాళాలు అందాయి. ఈ వివరాలు ప్రపంచ నలుమూలల భక్తులు యాదగిరిగుట్ట స్వామిపై కలిగిన అపార భక్తి, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
.jpeg&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!