
న్యూస్

రాష్ట్రంలో ఈ నెల చివరినాటికే ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో గరిష్ట ఉష్ణోగ్రత 41.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరి రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైంది. గత సంవత్సరం ఇదే తేదీన 41.2 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి తీవ్రంగానే ఉంది. మొత్తం 11 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవగా, మరో 13 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి వేడి కొనసాగింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రాబోయే మూడు రోజులపాటు ఈ తీవ్రతలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని సూచించింది.
ఇదిలా ఉండగా, అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో విషాద ఘటన కూడా చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన కలవలె విజయ్ (38) వడదెబ్బకు గురై మరణించినట్లు కుటుంబ సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ రాథోడ్ దిలీప్






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!