

భారతీయ రిజర్వు బ్యాంకు సైబర్ మోసాలను అరికట్టేందుకు ఐదు ముఖ్యమైన ప్రతిపాదనలు తీసుకొచ్చింది. డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల డబ్బును రక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.
ఈ ప్రతిపాదనల్లో భాగంగా పది వేల రూపాయలకుపైగా లావాదేవీలకు ఒక గంట ఆలస్యం విధించాలని సూచించారు. ఈ సమయంలో అనుమానం ఉంటే లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అనుమానాస్పద లావాదేవీలు కనిపించినప్పుడు అన్ని డిజిటల్ చెల్లింపులను ఒకేసారి నిలిపివేసే ప్రత్యేక సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. 70 సంవత్సరాలకుపైబడిన వారు మరియు దివ్యాంగులు 50,000 రూపాయలకుపైగా లావాదేవీలు చేయాలంటే నామినీ అనుమతి తప్పనిసరి చేయాలని సూచించారు.
మ్యూల్ ఖాతాల ద్వారా జరిగే మోసాలను అరికట్టేందుకు సరైన ధృవీకరణ లేని ఖాతాల్లో సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు మాత్రమే డబ్బు జమ అయ్యేలా పరిమితి విధించాలని భావిస్తున్నారు. కొత్త బ్యాంకు ఖాతాల్లో యూపీఐ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలను ముందుగానే నిలిపివేయాలని కూడా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై ప్రజల అభిప్రాయాలు తీసుకుని తరువాత అమలు చేయనున్నట్లు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!