

తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్‌లో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌ను హైజాక్ చేసి క్షణాల్లో టికెట్లు బుక్ చేస్తున్నట్టు వెల్లడైంది. శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చే భక్తుల కోసం ప్రతిరోజూ ఆన్లైన్లో విడుదల చేసే టికెట్లను థర్డ్ పార్టీ "ఆటో ఫిల్లింగ్" సాఫ్ట్వేర్ల సహాయంతో ప్రైవేట్ నెట్ సెంటర్లు, ట్రావెల్ ఏజెంట్లు ముందుగానే బుక్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సర్వర్ ప్రారంభమైన వెంటనే ముందుగా నమోదు చేసిన భక్తుల వివరాలను ఉపయోగించి 400 నుండి 500 టికెట్లను క్షణాల్లో బుక్ చేసి, రూ.10,500 విలువైన టికెట్లను రూ.13,500కు విక్రయిస్తూ ఒక్కో టికెట్‌పై రూ.3,000 వరకు దోపిడీ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్స్‌పై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!