

సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ ఐకాస చేపట్టిన సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతోంది. కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను నడిపిస్తోంది. ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి ప్రధాన బస్ స్టేషన్ల నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు.
సమ్మె విషయం తెలియక కొందరు ప్రయాణికులు బస్టాండ్లకు వచ్చి గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్, ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఛార్జీలు పెరగడంతో ఉద్యోగులు, విద్యార్థులు, దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంజీబీఎస్ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు మాత్రం నడుస్తున్నాయి. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు చెబుతుండగా, డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
















.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!