
టెక్నాలజీ

ప్రకాశం జిల్లా నాగులుప్పల పాడు మండలంలోని ఎం. ముప్పాళ్ల గ్రామంలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా పెయింటెడ్ స్టోర్క్స్ అనే పక్షులు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఇక్కడికి వచ్చి కొంత కాలం నివసిస్తాయి. రెక్కల చివర గులాబీ రంగు ఉండటంతో వీటికి పెయింటెడ్ స్టోర్క్స్ అనే పేరు వచ్చింది. తెలుగులో వీటిని “ఎర్ర కాళ్ల కొంగ” అని పిలుస్తారు.
ఈ పక్షులకు పొడవైన కాళ్లు, తెలుపు రంగులో నలుపు మచ్చలు, బలమైన శరీర నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. సుమారు 12 అంగుళాల పొడవు కలిగిన పసుపు రంగు ముక్కు వీటి ప్రత్యేకత. ఎం. ముప్పాళ్ల చెరువు మధ్యలో ఉన్న చెట్లపై ఇవి గూళ్లు కట్టుకుని నివసిస్తున్నాయి. గ్రామస్థుల సమాచారం ప్రకారం, 100కి పైగా పక్షులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వేసవి ముగిసే వరకు ఉండి వెళ్లిపోతాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!