
సినిమాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో 198 పోస్టుల భర్తీకి సంబంధించి TSLPRB డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు, 114 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలు నేరుగా రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా జరగనున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని అధికారులు తెలిపారు.
అర్హత కలిగిన, ఆసక్తి గల అభ్యర్థులు 2025 డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 20 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా అధికారిక వెబ్సైట్ ద్వారా నిర్వహించబడుతుంది. పోస్టుల అర్హతలు, వయస్సు పరిమితి, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.tgprb.in/ tslprb.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.

_1771477764226.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!