

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక అంశాలు చర్చకు వస్తున్న సమయంలో, వైసీపీ ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి ఒక విభిన్న అంశాన్ని లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్లో నాటు కోడి ధరలు మటన్ కంటే ఎక్కువగా పెరిగాయా? అనే ప్రశ్నను ఆయన పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. నాటు కోడి ధరలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని పేర్కొంటూ, ఈ విషయంపై తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.
ఈ అంశంపై స్పందించిన కేంద్ర పశుసంవర్ధక శాఖ, నాటు కోడి ధర కిలోకు సగటున ₹500 ఉండగా, మటన్ ధర కిలోకు సుమారు ₹900 ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో నాటు కోడి మటన్ కంటే తక్కువ ధరలోనే ఉందని తెలిపింది. అలాగే బర్డ్ ఫ్లూ వంటి పరిస్థితుల్లో పౌల్ట్రీ రైతులకు నష్టపరిహారం అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించింది. అనంతరం అవినాష్ రెడ్డి, నాటు కోడి ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి వ్యంగ్య వ్యాఖ్యలకు దారి తీసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!