

ప్రఖ్యాత కవి, రచయిత నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం-2025 లభించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిధారెడ్డికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో మానవాళి ఎదుర్కొన్న సంక్షోభాలు, మానవ సంబంధాల మార్పులను తన ‘అనిమేష’ కవితా సంపుటిలో హృద్యంగా ప్రతిబింబించిన మానవతావాది అని సీఎం కొనియాడారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అక్షరాలను ఆయుధాలుగా మలచి ఉద్యమ స్ఫూర్తిని విస్తృతంగా వ్యాప్తి చేసిన ఘనత సిధారెడ్డిదేనని రేవంత్ రెడ్డి ప్రశంసించారు. తన రచనల ద్వారా సమాజంపై లోతైన ప్రభావం చూపిన సాహితీవేత్తగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు. అనేక కవితా సంపుటాలు, రచనలతో ఆధునిక తెలంగాణ సాహిత్యాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దిన ప్రముఖ రచయితల్లో నందిని సిధారెడ్డి ముందువరుసలో ఉన్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.







.jpeg&w=3840&q=75)












.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!