

అఖిల్ అక్కినేని చాలా కాలం తర్వాత ‘లెనిన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గత సినిమా తర్వాత వచ్చిన విరామం కారణంగా ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. బలమైన కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. సంగీత దర్శకుడు థమన్ అందించిన మ్యూజిక్ టీజర్లు ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకున్నాయి.
ఈ చిత్రం విడుదల సమయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 26 న సినిమా థియేటర్లలో విడుదల కానుండగా, పెద్ద సినిమాల మధ్య గ్యాప్ ఉండటం అఖిల్‌కు ప్లస్‌గా మారే అవకాశముందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాగార్జున చేసిన సానుకూల వ్యాఖ్యలు కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. కథ, ప్రదర్శన, విడుదల సమయం అన్నీ కలిసి వస్తే ‘లెనిన్’ అఖిల్ కెరీర్‌లో కీలక విజయంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!