

వేసవిలో చాలా మంది చల్లని పానీయాలు తాగడం ద్వారా తక్షణ చల్లదనాన్ని పొందాలని చూస్తారు. ఇవి రుచిగా ఉన్నప్పటికీ, చిప్స్‌తో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లని పానీయాలలో అధికంగా చక్కెర ఉండటం, కొన్ని పానీయాలలో కెఫీన్ ఉండటం వల్ల తాత్కాలికంగా దాహం తగ్గినట్లు అనిపించినా, వాస్తవానికి శరీరంలో నీరు తగ్గే ప్రమాదం ఉంది. దీని వల్ల నీరసం, తల తిరగడం, అలసట వంటి సమస్యలు రావచ్చు. వేసవిలో శరీరానికి అవసరమైన తేమ తగ్గిపోవడం మరింత ప్రమాదకరంగా మారుతుంది.
చిప్స్‌లో అధిక ఉప్పు మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండడం వల్ల శరీరంలో నీటి స్థాయిలు తగ్గడమే కాకుండా ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతింటుంది. ఎక్కువ ఉప్పు తీసుకోవడం దాహాన్ని పెంచి మళ్లీ మళ్లీ చల్లని పానీయాలు తాగే అలవాటును పెంచుతుంది. ఈ రెండింటిని తరచుగా కలిపి తీసుకుంటే దీర్ఘకాలంలో బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, యువతలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి సహజ పానీయాలు మరియు మఖానా, వేరుశెనగలు, తాజా పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత సలహా కోసం నిపుణులను సంప్రదించాలి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!