
న్యూస్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రత, పోలింగ్ నిర్వహణపై అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం సీఎస్, డీజీపీతో ఎస్ఈసీ ప్రత్యేక సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారని అధికారులు చెబుతున్నారు. సమావేశాల అనంతరం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉందని చర్చ సాగుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!