

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎమ్మెల్యేలు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని మండలానికి కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక పాఠశాల వెయ్యి మంది విద్యార్థులతో నిండిపోయేలా చేయాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యేలు ప్రతివారం ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి వసతులు, హాజరు పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని లోకేష్ కోరారు. అలా ఫీడ్బ్యాక్ అందితే వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. విద్యావ్యవస్థ బలోపేతం కేవలం మంత్రి లేదా అధికారుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే దీర్ఘకాలిక మార్పులు సాధ్యమవుతాయని మంత్రి తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!