
సినిమాలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ‘రామాయణ’, ‘ది ఇండియన్ స్టోరీ’ వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ హీరోలు, హీరోయిన్ల మధ్య రెమ్యూనరేషన్‌లో ఉన్న భారీ తేడాపై స్పందించారు. ఈ వివక్ష ఇంకా కొనసాగుతుందని, మార్పు రావాలంటూ ఆమె వ్యాఖ్యానించారు. తల్లి అయిన తర్వాత పని విధానంలో మార్పులు వచ్చాయని, రోజుకు 9 గంటల షిఫ్ట్ మాత్రమే పని చేస్తానని చెప్పిన ఆమె, సౌత్ ఇండస్ట్రీలో క్రమశిక్షణ, మహిళలకు ఇచ్చే గౌరవం ఎక్కువగా ఉంటుందని ప్రశంసించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!