

ఉపాసన కొణిదెల హైదరాబాద్‌లోని శ్రీ రాములు థియేటర్‌లో జరిగిన పెద్ది ప్రత్యేక ప్రీమియర్ షోను వీక్షించింది. తన తండ్రితో కలిసి వచ్చిన ఉపాసన, అభిమానులతో కలిసి థియేటర్‌లో ఉత్సాహంగా పాల్గొంది. కీలక సన్నివేశాల సమయంలో ప్రేక్షకులతో కలిసి కేరింతలు కొడుతూ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఎంట్రీ సీన్స్‌కు చప్పట్లు కొడుతూ, విజిల్స్ వేస్తూ సంబరాల్లో మునిగిపోయింది.
కొన్ని సన్నివేశాల్లో పేపర్ ముక్కలను గాల్లోకి విసురుతూ థియేటర్ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ క్రాస్ అథ్లెట్ పాత్రలో కనిపిస్తూ క్రికెట్, రెజ్లింగ్, స్ప్రింటింగ్ వంటి క్రీడల్లో ప్రతిభ చూపిస్తూ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని చూపించారు. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. రామ్ చరణ్ నటనపై అభిమానులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!