
రాజకీయాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా థియేటర్లలో భారీ విడుదలకు సిద్ధమైంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ గ్రామీణ క్రీడా నేపథ్య చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై భారీ అంచనాలు రేపుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి.
ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.130 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన 45 రోజుల తర్వాత లేదా 6 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని టాక్. ఈ లెక్కన జూలై చివరి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, థియేటర్ రన్ ఆధారంగా మార్పులు ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!