
సినిమాలు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో యూకే వీసా రిన్యూవల్ మోసం కేసులో యూట్యూబర్ సహా ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో బాధితుడిని నమ్మించి సుమారు ₹15 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు యూకేలో ఉన్న సమయంలో వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పలువురు నెలలు గడిచినా వీసా రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నంబర్ 515/2025 కింద కేసు నమోదు చేశారు. డైరెక్టర్ జగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన అలియాస్ నందు, అలాగే ఆయన తండ్రిపై కేసు నమోదు అయింది. మరిన్ని బాధితులు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!