

రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఈ రోజు లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శూక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో మార్చి 27న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ అర్చకులు మరియు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి గవర్నర్‌కు అందజేశారు.
భద్రాచలం సీతారాముల కళ్యాణం యొక్క విశిష్టతను మంత్రి సురేఖ వివరించారు. దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే ఈ పవిత్ర వేడుకను రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు మరియు అర్చకులు పాల్గొన్నారు.











.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!