
క్రీడలు

చాలా కాలంగా నిలిచిపోయిందనుకున్న ఐబొమ్మ వెబ్సైట్ మళ్లీ యాక్టివ్ కావడం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కొత్త సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ వెబ్సైట్లో ప్రత్యక్షమవుతుండటంతో మరోసారి పైరసీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామం చిత్ర పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది.
గతంలో ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన పైరసీ వ్యవహారంలో ఇమంది రవి అరెస్టు కావడంతో ఐబొమ్మ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయని భావించారు. వెబ్సైట్ కూడా తమ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించింది. ప్రస్తుతం రవి బెయిల్‌పై బయట ఉండగా, ఇదే సమయంలో వెబ్సైట్ మళ్లీ యాక్టివ్ కావడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు ఈ కార్యకలాపాల వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!