

నీట్ యూజీ – 2026 వంటి దేశవ్యాప్త భారీ ప్రవేశ పరీక్ష నిర్వహణ ప్రభుత్వం, జాతీయ పరీక్షల సంస్థకు పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నెల 3 న జరిగిన పరీక్షకు సుమారు 22 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వేలాది పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రశ్నపత్రాల తయారీ, భద్రతా ఏర్పాట్లు, బయోమెట్రిక్ ధృవీకరణ, సిబ్బంది నియామకం వంటి పనుల కోసం భారీ స్థాయిలో ఖర్చు జరిగినట్లు తెలుస్తోంది.
పేపర్ లీకేజీ ఆరోపణలు, మళ్లీ పరీక్ష నిర్వహణపై చర్చలు మొదలవడంతో ఆర్థిక భారం అంశం కూడా ప్రధానంగా మారింది. ఒకవేళ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సి వస్తే ప్రభుత్వం అదనంగా వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు భరించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిణామాలు విద్యార్థులు, తల్లిదండ్రులపై మానసిక ఒత్తిడిని పెంచడంతో పాటు పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతపై కూడా ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!