

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. మే నెలకు సంబంధించిన వివిధ దర్శన కోటా టిక్కెట్లను ఇవాళ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వేర్వేరు సమయాల్లో ఈ టిక్కెట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
ఉదయం 10 గంటలకు మే నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోటా విడుదల చేయబడుతుంది. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన దర్శన టిక్కెట్లు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తుల కోసం ప్రత్యేక దర్శన కోటా టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి.
దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా ‘టీటీదేవస్థానాలు’ మొబైల్ యాప్ ద్వారానే నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. టిక్కెట్లు విడుదలైన కొద్ది నిమిషాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉన్నందున, భక్తులు ముందుగానే తమ వివరాలతో సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!