
వంట గ్యాస్ కొరత మరియు ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ విపక్ష నాయకులు పార్లమెంట్ ఆవరణలో వినూత్నంగా నిరసన చేపట్టారు. సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూపించేందుకు కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసి ఆందోళన నిర్వహించారు. ప్రధాన మంత్రిని విమర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు సభ్యులు ఈ నిరసనలో పాల్గొన్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం గురించి పార్లమెంట్‌లో చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతును అణిచివేయడం ప్రభుత్వ ధోరణిగా మారిందని విమర్శిస్తూ, ఈ అంశాలపై ప్రధాన మంత్రి పార్లమెంట్‌లో స్పందించాలని కోరారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!