

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న ‘ధురంధర్: ది రివెంజ్’ (ధురంధర్ 2) చిత్రంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1500 నుంచి రూ.2000 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న దక్షిణాది సినిమాల ఆధిపత్యానికి గట్టి దెబ్బ తగులుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వర్మ, వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటాయని చెప్పారు. దక్షిణాది సినిమాలు ఇప్పటికీ పాత శైలిలోనే రూపొందుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ధురంధర్ 2’ను దక్షిణాదిలో కూడా భారీగా ప్రమోట్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేసిన వర్మ, మొదటి భాగంతో ప్రేక్షకులు ఇప్పటికే అనుబంధం పెంచుకున్నారని తెలిపారు. బాహుబలి తరహాలో ఈ రెండు భాగాలను ఒకే కథ కొనసాగింపుగా చిత్రీకరించారని, అందుకే రెండో భాగం మరింత పెద్ద విజయాన్ని సాధిస్తుందని అంచనా వేశారు.



















.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!