.png&w=3840&q=75)
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్స్‌తో కలిసి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. బాబీ కొల్లి, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో ఆయన ఇప్పటికే పెద్ద విజయాలు సాధించారు. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా పూర్తి అవుతోంది.
తాజాగా సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మాయ రూపొందించిన పల్లెటూరి మాస్ కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కథ రామ్ చరణ్ ‘రంగస్థలం’ కన్నా మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. చిన్న సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకున్న మెగాస్టార్, వచ్చే నెల నుంచి షూటింగ్స్‌తో తిరిగి బిజీ అవుతున్నారు.
చిరంజీవి వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ నాటికి బాబీ సినిమా, ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల మూవీ వరుసగా సందడి చేయనున్నాయి.










.png&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!