
ఓటిటి

ప్రజాభవన్లో మంత్రి సీతక్కను టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, సినీనటి మంచు లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మంత్రి సీతక్కను ఆమె ఆహ్వానించారు.
భేటీ సందర్భంగా తన ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను మంచు లక్ష్మి మంత్రికి వివరించారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధనను ప్రోత్సహించేందుకు తమ సంస్థ చేస్తున్న కృషిని ఆమె వివరించారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన అందించేందుకు టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.
సామాజిక సేవా కార్యక్రమాలపై మంచు లక్ష్మి చూపుతున్న నిబద్ధతను మంత్రి సీతక్క అభినందించారు. విద్యారంగ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!