
న్యూస్

భారత్‌లో ఇటీవల నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ కొరతకు ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ‘శివాలిక్’ ఎల్పీజీ ట్యాంకర్ నౌక ఖతార్‌లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరి ఇరాన్‌కు సమీపంలోని హర్మూజ్ జలసంధి దాటి గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. ఈ నౌకలో సుమారు 40 నుంచి 46 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉన్నట్లు సమాచారం.
అదే రాస్ లఫాన్ పోర్టు నుండి బయలుదేరిన మరో ఎల్పీజీ ట్యాంకర్ ‘నందా దేవి’ ఇప్పటికే గుజరాత్ తీరానికి సమీపంలో ఉంది. ఈ నౌక మార్చి 17 ఉదయం 6:30 గంటలకు కాండ్లా పోర్టుకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ రెండు నౌకలు కలిపి సుమారు 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ భారత్‌కు తీసుకొస్తుండడంతో దేశంలో గ్యాస్ సరఫరా పరిస్థితి మెరుగుపడే అవకాశముంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!