
దేశంలో గృహ ఎల్పీజీ (LPG) సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ నిత్యావసర వస్తువుల చట్టం–1955 కింద 2026 నిన్న కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి అన్ని చమురు మార్కెటింగ్ సంస్థలు లభ్యమయ్యే మొత్తం LPG ను కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించింది.

ఈ నిర్ణయంతో వాణిజ్య, పారిశ్రామిక మరియు పెట్రోకెమికల్ వినియోగదారులకు LPG సరఫరాను తక్షణమే నిలిపివేశారు. ప్రస్తుతం LPG దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోని ప్రతి కుటుంబానికి నిరాటంక గ్యాస్ సరఫరా కొనసాగించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దిగుమతులు త్వరలో పునరుద్ధరించబడతాయని, పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!