

విమాన ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సీట్ల కేటాయింపులో కనీసం 60 శాతం సీట్లపై అదనపు చార్జీలు విధించకూడదని సూచించింది. ప్రస్తుతం కేవలం 20 శాతం సీట్లు మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉండగా, మిగతా సీట్లకు ప్రయాణికులు అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఇకపై ఒకే పీఎన్ఆర్పై బుక్ చేసిన ప్రయాణికులను ఒకే దగ్గర కూర్చోబెట్టేలా ఎయిర్‌లైన్స్ చర్యలు తీసుకోవాలని డీజీసీఏ సూచించింది.
ఈ మార్గదర్శకాలు దేశీయ విమాన రూట్లకు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల హక్కుల పరిరక్షణకు ఈ నిర్ణయం కీలకమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. భారత్ ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణాల్లో ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది. 2026 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణికుల సంఖ్య 17.5 నుంచి 18.1 కోట్ల మధ్యకు చేరే అవకాశం ఉందని అంచనా. అలాగే దేశంలో విమానాశ్రయాల సంఖ్య గణనీయంగా పెరుగుతూ, విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

.png&w=3840&q=75)










.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!