
క్రీడలు

ఇర్ఫాన్ ఖాన్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో సీట్ బెల్ట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఇర్ఫాన్‌ను ఆపినట్లు వీడియోలో కనిపిస్తోంది. ట్రాఫిక్ పోలీసు అధికారి మొదట కారులో ఉన్న వారితో నిబంధనల గురించి సీరియస్‌గా మాట్లాడారు.
తర్వాత ఇర్ఫాన్‌ను ప్రముఖ క్రికెటర్‌గా గుర్తించిన పోలీసు అధికారి, సెలబ్రిటీగా ప్రజలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. సుమారు రూ.5,000 పాక్ కరెన్సీ జరిమానా పడొచ్చని హెచ్చరించినప్పటికీ చివరకు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అనంతరం పాకిస్థాన్ క్రికెట్ లీగ్ 2026, అలాగే రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్ కింగ్స్‌మెన్ ప్రదర్శనపై కూడా వారిద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!