

ఎయిరిండియా సంస్థ గత మూడేళ్లలో నైతిక విలువలు, సంస్థ నిబంధనలు ఉల్లంఘించిన వెయ్యికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. ఇటీవల జరిగిన టౌన్‌హాల్ సమావేశంలో ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రావెల్ పాలసీల దుర్వినియోగం, సంస్థ వస్తువుల దొంగతనం, ఇతర అక్రమ చర్యలపై కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.
విమానాల్లోని వస్తువులను దొంగిలించడం, అదనపు బ్యాగేజీకి ఛార్జీలు వసూలు చేయకుండా అనుమతించడం వంటి ఘటనల్లో కొందరు ఉద్యోగులు పట్టుబడ్డారని విల్సన్ తెలిపారు. ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ పాలసీని కూడా వందలాది మంది సిబ్బంది దుర్వినియోగం చేసినట్లు అంతర్గత దర్యాప్తులో తేలిందన్నారు. ఉచిత టికెట్లను విక్రయించడం, కుటుంబ సభ్యుల పేరుతో ఇతరులకు ప్రయోజనాలు కల్పించడం వంటి చర్యలపై సంస్థ పెనాల్టీలు విధించింది. ప్రస్తుతం ఎయిరిండియాలో సుమారు 24 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!