

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, బీహార్ నుంచి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోంది. అలాగే శ్రీలంక ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.
దీని ప్రభావంతో కోస్తాంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడొద్దని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!