

పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య పరిస్థితిని వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి హైదరాబాద్లోని తన నివాసానికి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియాలో చేసిన విస్తృతమైన పోస్టులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తన సతీమణి అన్నా కొణిదల, పిల్లలు అకీర నందన్, ఆద్య, పోలినా అంజని, మార్క్ శంకర్లతో కలిసి ప్రధానిని ఆత్మీయంగా ఆహ్వానించినట్లు తెలిపారు. దేశ బాధ్యతల మధ్య కూడా సమయం కేటాయించి తన ఇంటికి రావడం మోదీ మానవతా నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఏప్రిల్ 19న శస్త్రచికిత్స అనంతరం ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఫోన్ చేసి తన ఆరోగ్యం గురించి తెలుసుకుని ధైర్యం చెప్పారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. కోలుకుంటున్న సమయంలో స్వయంగా ఇంటికి రావడం జీవితాంతం గుర్తుండిపోయే సంఘటనగా అభివర్ణించారు. ప్రధాని మోదీ వినయం, ప్రజలతో భావోద్వేగ అనుబంధం, దేశాభివృద్ధిపట్ల అంకితభావం కోట్ల మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని పవన్ కళ్యాణ్ కొనియాడారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!