
న్యూస్

దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరతపై వస్తున్న వదంతుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సమస్యను తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా సరఫరాను కొనసాగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వచ్చింది.
ఈ నిర్ణయం ప్రకారం 21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కిరోసిన్ పంపిణీ చేయనున్నారు. సర్వీస్ కేంద్రాల్లో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకునే అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ ఆదేశాలు 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

.png&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!