

విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరేందుకు మన్నార్గుడి ఎమ్మెల్యే కామరాజ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టి.టి.వి దినకరన్ స్థాపించిన పార్టీ నుంచి గెలిచిన ఆయన, టీవీకేలో చేరితే పార్టీ బలం మరింత పెరుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అదే విధంగా డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్ కూడా విజయ్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ తనకు కుటుంబ సభ్యుడిలాంటి వారని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చేరికలు జరిగితే టీవీకే బలం మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
2024లో స్థాపించిన టీవీకే పార్టీ చాలా తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా బలమైన గుర్తింపును సంపాదించింది. పార్టీ జెండా, సిద్ధాంతాలు, గుర్తు అన్నీ వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన విజయ్ వ్యూహం విజయవంతమైంది. కోట్లాది అభిమానులు, బలమైన కేడర్‌తో టీవీకే తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!