
న్యూస్

దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక ఐఐటీలలో 2026 – 27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఐఐటి రూర్కీ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ పరీక్షను మే 17 న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఐఐటీలలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు ఈ పరీక్ష అత్యంత ముఖ్యమైన ప్రవేశ పరీక్షగా భావించబడుతుంది.
అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఆన్లైన్ నమోదు ప్రక్రియ వచ్చే నెల 23 న ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్స్ తుది విడత ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఈ నమోదు ప్రారంభమవుతుంది. విదేశీ విద్యార్థుల దరఖాస్తులను మాత్రం ఏప్రిల్ 6 నుంచి స్వీకరించనున్నారు. వారికి మే 2 వరకు గడువు ఇచ్చారు. అభ్యర్థులు jeeadv.ac.in అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!