

హైదరాబాద్లోని ప్రముఖ రెస్టారెంట్ చైన్లు పిస్తా హౌస్, షాగౌస్, మెహ్ఫిల్ హోటల్స్ యజమానుల ఇళ్లలో, కార్యాలయాల్లో గత రెండు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీ స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్నారు.
రాజేంద్రనగర్ గోల్డెన్ హైట్స్ కాలనీలో ఉన్న పిస్తా హౌస్ ఓనర్లైన మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ముస్తాన్ నివాసాలతో పాటు, షాగౌస్ మరియు మెహ్ఫిల్ చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్లోని లక్డీకాపూల్, షేక్పేట్, అత్తాపూర్, టోలీచౌకి, గచ్చిబౌలి సహా సుమారు 30 ప్రాంతాల్లో ఐటీ శాఖ సోదాలు చేపట్టింది. ఇప్పటి వరకు దాదాపు ₹20 కోట్ల నగదు, అలాగే భారీ పరిమాణంలో బంగారం స్వాధీనం చేసినట్లు సమాచారం.
అదనంగా, వర్కర్ల పేర్లపై ఉన్న బినామీ ఆస్తుల పత్రాలు, అలాగే పలువురి పేర్లలో ఉన్న బ్యాంక్ లాకర్లు కూడా అధికారులు గుర్తించారు. బ్లాక్ మనీని హవాలా మార్గంలో మళ్లించినట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది.
ఇవాళ కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది.





.jpg&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!