
గాసిప్స్

భారత్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. ఈ కంపెనీ 17.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.5 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఇది ఆసియా ఖండంలో భారత్లో మైక్రోసాఫ్ట్ చేసిన అతిపెద్ద పెట్టుబడిగా నిలవనుంది.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ విషయాన్ని ట్విటర్లో వెల్లడించారు. అలాగే, ప్రధాని మోదీని కలిసిన ఫొటోను పోస్ట్ చేశారు. భారత్లో కృత్రిమ మేధ (AI) రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల అభివృద్ధి కోసం ఈ నిధులను వినియోగిస్తామని నాదెళ్ల తెలిపారు. భారత్లో సాంకేతిక అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!