

ఇండిగో (ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్) షేర్లు నేడు స్టాక్‌మార్కెట్ లో పెద్ద దెబ్బ తిన్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే షేర్ విలువ 7% వరకూ గట్టిగా పతనమైంది, మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. తర్వాత కొంత మేర కోలుకున్నప్పటికీ, ఉదయం 10 గంటల సమయానికి 4.08% నష్టంతో రూ. 5,151 వద్ద ట్రేడింగ్ కొనసాగింది.
ఇటీవలి రోజుల్లో ఇండిగో విమాన సర్వీసుల్లో ఏర్పడిన తీవ్ర అంతరాయాలు, వందల సంఖ్యలో విమానాల రద్దు, ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులు - ఇవన్నీ కలిసి కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మదుపర్లలో భయం పెరిగి, వారు ఇండిగో షేర్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. దీంతో షేర్ ధరపై ఒత్తిడి మరింతగా పెరిగింది.
అదే సమయంలో, విమానయాన రంగంలోకి చెందిన ఇతర షేర్లపైన ప్రభావం పడుతుందేమో అనే అనుమానాలు మార్కెట్లో వ్యక్తమవుతున్నాయి. ఇండిగో నిర్వహణపై డీజీసీఏ ఇప్పటికే షోకాజ్ నోటీసు జారీ చేయడం కూడా మదుపర్ల ఆందోళనకు కారణమైంది. నిపుణుల ప్రకారం, కంపెనీ కార్యకలాపాలు పూర్తిగా స్థిరపడే వరకు ఇండిగో షేర్ ధరల్లో అస్థిరత కొనసాగే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!