

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. మొత్తం 45 మంది అధికారులకు బదిలీలు లేదా కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు విడుదల చేశారు.
ఈ బదిలీల్లో కీలక శాఖలకు కొత్త అధికారులను నియమించారు. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కుమార్ ను నియమించారు. ఎస్పీడీసీఎల్ సీఎండీగా జితేష్ వి. పాటిల్, కొత్త డిస్కం సీఎండీగా ముషారఫ్ ఫారూకీ బాధ్యతలు చేపట్టారు. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఈ. శ్రీధర్, ఐటీ & సీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్, ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్ నియమితులయ్యారు.
ఇతర ముఖ్య బదిలీల్లో సబ్యసాచి ఘోష్ కు ఫ్లాగ్షిప్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ స్కీమ్స్, CSR బాధ్యతలు అప్పగించారు. ఎం. దాన కిషోర్ కు విపత్తు నిర్వహణ శాఖ అదనపు బాధ్యతలు, రాహుల్ బోజ్జా కు రాజకీయ వ్యవహారాల శాఖతో పాటు బీసీ వెల్ఫేర్ అదనపు బాధ్యతలు ఇచ్చారు. బి. విజేంద్ర, డి. దివ్య, అద్వైత్ కుమార్ సింగ్ లకు కూడా కొత్త నియామకాలు జరిగాయి. ఈ మార్పులతో పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!