
గాసిప్స్

భారత వాయుసేన బలాన్ని మరింత పెంచే దిశగా కీలక ముందడుగు పడింది. ఇండియన్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు మరో 114 రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సుమారు రూ.3.25 లక్షల కోట్ల విలువైన ఈ డీల్‌కు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, క్యాబినెట్ కమిటీ తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది. ఈ నెలలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత పర్యటన సందర్భంగా ఒప్పందం ఫైనల్ అయ్యే అవకాశముందని సమాచారం.
ఫ్రెంచ్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ సహకారంతో ఈ రాఫెల్ జెట్లను 60 శాతానికి పైగా స్వదేశీ కంటెంట్‌తో తయారు చేయనున్నారు. ఈ కొనుగోలుతో భారత వాయుసేనలో రాఫెల్ యుద్ధవిమానాల సంఖ్య 176కు చేరనుంది. ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతమివ్వడంతో పాటు దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయనుందని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!