
గాసిప్స్
.png&w=3840&q=75)
హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న చెరువుల పునరుద్ధరణ పనులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పునరుద్ధరించిన చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని సీఎం సూచించారు. టూరిజం శాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
హైటెక్ సిటీ తుమ్మిడికుంట వద్ద ఐటీ ప్రముఖులు, ఉద్యోగులను ఆహ్వానిస్తూ కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని సీఎం సూచించారు. అలాగే కూకట్పల్లి నల్లచెరువు వద్ద సినిమా ప్రముఖులతో, రాజేంద్రనగర్ బురుకుదఫిన్ చెరువు వద్ద క్రీడాకారులతో ప్రత్యేక కైట్ ఫెస్టివల్ నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని 11, 12, 13 తేదీలలో మూడు రోజుల పాటు నిర్వహించాలని సీఎం ప్రతిపాదించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!