

తరుణ్ భాస్కర్ హీరోగా కొత్త దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన సినిమా ‘గాయపడ్డ సింహం’. ఈ సినిమాలో జే డీ చక్రవర్తి బ్రూటల్ ధర్మ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. మే 1న విడుదల కానున్న ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. జే డీ చక్రవర్తి రెట్రో గ్యాంగ్‌స్టర్ వైబ్‌తో స్టైలిష్ సూట్లు, డార్క్ షేడ్స్, మెడలో గోల్డ్ చైన్‌తో క్రూరంగా కనిపిస్తూ, డామినేట్ చేసేలా ఉన్నాడు.
సత్య లాజిస్టిక్స్ కంపెనీ ముసుగులో అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాల వ్యాపారం చేసే డాన్‌గా ఆయన పాత్ర ఆకట్టుకోబోతుంది. గ్లింప్స్‌లో కనిపించిన డార్క్ హ్యూమర్ సీన్స్ సినిమా స్టైల్‌ను ప్రతిబింబిస్తాయట.ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 1న రిలీజ్ అవుతుంది. జే డీ చక్రవర్తి ఎంట్రీతో అంచనాలు బాగా పెరిగాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!