
రాజకీయాలు

కంగనా రనౌత్ బాలీవుడ్లో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రాలకు గుర్తింపు తెచ్చుకున్న నటి. ముఖ్యంగా క్వీన్ సినిమా ఆమె కెరీర్లో మైలురాయిగా నిలిచింది. అయితే ఇటీవల కాలంలో ఆమె సినీ ప్రయాణం మందగించింది. మణికర్ణిక తర్వాత ఆమెకు పెద్ద హిట్ రాలేదు. ఆమె చేసిన కొన్ని రాజకీయ బయోపిక్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.
ప్రస్తుతం రాజకీయ రంగంలో కొనసాగుతున్న కంగనా, మళ్లీ సినిమాల్లో కంబ్యాక్ ఇవ్వడానికి క్వీన్ సీక్వెల్‌ను ప్లాన్ చేస్తోంది. ఇది కొనసాగింపు కాకుండా, కొత్త కథతో రూపొందనుంది. ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా జర్నీ ఆధారితంగా ఉండనుందని సమాచారం. ఈ ఏప్రిల్ చివరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్‌తో కంగనా మళ్లీ తన సత్తా చాటుతుందా అన్నది ఆసక్తిగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!